భోజనం తిన్నాక చేయకూడని పనులు ఇవే భోజనం చేసే సమయంలోనే కాదు, భోజనం పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. భోజనం చేశాక కొన్ని పనులు చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటివి ఇబ్బంది పెట్టొచ్చు. భోజనం చేశాక ధూమపానం చేయడం వల్ల అందులో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు గాలి ద్వారా మన పొట్టలోకి ఇబ్బంది పెడతాయి. భోజనం చేశాక చాలామందికి నిద్ర వచ్చేస్తుంది. అయినా సరే నిద్రపోకూడదు. నిద్రలో జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం అవ్వక ఇబ్బందులు ఎదురవుతాయి. భోజనం చేసిన వెంటనే స్నానం చేయవద్దని ప్రాచీన కాలం నుంచి పెద్దలు చెబుతూనే ఉన్నారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల మన శరీరంలో శక్తి తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. దీనివల్ల ఆహారం జీర్ణం అయ్యే శాతం కూడా తగ్గుతుంది. పొట్ట నిండా ఆహారం తిన్నాక టీ తాగే వాళ్ళు ఎంతోమంది. ఇలా చేయడం వల్ల శరీరం, ఇనుమును శోషించుకోకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. భోజనం పూర్తయిన వెంటనే మాత్రం పండ్లను తినకండి. అలాగే చల్లటి నీటిని కూడా తాగకూడదు.