అధిక కొలెస్ట్రాల్ గుండెకి ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయి. తగ్గించుకొకపోతే మాత్రం ప్రాణాంతకం కావచ్చు. ఊబకాయం ఉన్న వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. రోజుకి కనీసం రెండు కప్పుల గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల హైపర్లిపిడెమియా నుండి రక్షణగా ఉందని బలమైన ఎపిడెమియోలాజిక్ ఆధారాలు ఉన్నాయి. పాలకు ఉత్తమ ప్రత్యామ్నాయాలలో సోయా పాలు ఒకటి. అపెక్స్ బాడీ ప్రకారం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి రోజుకి 25 గ్రాముల సోయా ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. దానిమ్మ రసంలో టానిన్లు, ఆంథోసైనిన్‌లు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. యాంటీ అథెరోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. దానిమ్మ శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ని కరిగించేస్తుంది. ఈ రెడ్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు 3-10 శాతం తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఇవే కాదు యాపిల్స్, అరటిపండు, బెర్రీలు, నారింజ, అవకాడో వంటి పండ్లు కూడా చెడు కొలెస్ట్రాల్ పోగొట్టుకునేందుకు సహాయం చేస్తాయి.