పుల్లటి పెరుగు తినడం కష్టమే. కానీ దానితో అనేక వంటకాలు చేసుకోవచ్చు. వాటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
చీల పిండి చేయడానికి నీటిని కాకుండా పుల్లని పెరుగు వాడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. చీలా ఆరోగ్యకరమైన పదార్థం.
శనగ పిండి, జోవర్, సూజి, రాగి, రాజ్ గిరా, ఓట్స్ వంటి వివిధ రకాల పిండిని ఉపయోగించి చీలా తయారు చేస్తారు.
పుల్లని పెరుగుతో మజ్జిగ చేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర పొడి, పుదీనా, ఉప్పు, కొత్తిమీర వేసుకుంటే మజ్జిగరుచిగా ఉంటుంది.
ధోక్లా పిండి మృదువుగా చక్కని రుచి రావాలంటే పుల్లని పెరుగు ఉపయోగించాలి. నార్త్ ఇండియన్స్ కి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఇది.
పెరుగుతో చేసే మరొక వంటకం కది సొర్. నార్త్ ఇండియాలో రాజ్మా చావల్ ఎంత పాపులర్ అయిందో కదీ చావల్ కూడా అంతే పాపులర్.
కదీని పెరుగుతో పాటు బేసన్ లేదా మూంగ్ పప్పు ఉపయోగించి తయారుచేస్తారు.
దక్షిణ భారతదేశంలో అత్యధికులు మెచ్చే బ్రేక్ ఫాస్ట్ కర్డ్ రైస్. వేసవిలో తప్పనిసరిగా తింటారు.
పొడి చర్మానికి పెరుగు మాయిశ్చరైజింగ్ గా పని చేస్తుంది. చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది.
Images Credit: Pexels/ Pixabay/ Unsplash