సోయా మీల్ మేకర్ మగవారు తినకూడదా?

సోయాబీన్స్ ను ఉపయోగించి చేసే ఉత్పత్తి సోయా చంక్స్. వీటిని సోయా మీల్ మేకర్ అంటారు.

చాలామంది మగవారిలో సోయా మీల్ మేకర్‌ను తినడం సురక్షితం కాదని భావన ఉంది.

దీనికి కారణం ఏమిటంటే సోయాబీన్స్‌లో ఫైటో ఈస్ట్రోజన్ అని పిలిచే వివిధ రకాల మొక్కల సమ్మేళనాలు ఉంటాయి.

ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్‌కు సమానమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోన్.


సోయా అధికంగా తినడం వల్ల మగవారి శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు అని ఎంతోమంది భావన.


అయితే ఇది శాస్త్రీయంగా ఇంతవరకు నిరూపణ జరగలేదు, కాబట్టి ఇది నిజమో కాదో చెప్పే అవకాశం కూడా లేదు.


ఏ ఆహారాన్నయినా మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అలాగే సోయా మీల్ మేకర్ ను కూడా మితంగా తీసుకుంటే శరీరానికి ఆరోగ్యమే తప్ప అనారోగ్యం ఉండదు.


సోయా మీల్ మేకర్ వల్ల శరీరానికి ప్రొటీన్ అందుతుంది.