రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం ఇప్పుడు అందరూ బయట అమ్మే అయోడైజ్డ్ ఉప్పు ప్యాకెట్లని కొంటున్నారు. అయితే రాతి ఉప్పుని వాడడం పూర్తిగా మానేశారు. అలా కాకుండా వారంలో ఒకటి, రెండు సార్లు అయినా రాతి ఉప్పును వాడడం చాలా మంచిది. రాతి ఉప్పులో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ ఇలా శరీరానికి మేలు చేసే ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ రాతి ఉప్పులో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి హానికరం కాదు. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్ కంటెంట్ కండరాల నొప్పిని, తిమ్మిరి నుంచి కాపాడుతుంది. శరీరంలోని నరాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం రాతి ఉప్పు పేగు ఆరోగ్యానికి మంచిది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సమస్యలకు చెక్ పెడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాతి ఉప్పు తయారీలో ఎలాంటి ప్రాసెసింగ్ జరగదు. అంటే ఇది సహజమైన పద్దతిలో లభిస్తుంది. సాధారణ టేబుల్ సాల్ట్‌ను ప్రాసెస్ చేస్తారు. దాంతో పోల్చుకుంటే రాతి ఉప్పు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.