ఈ సమస్య ఉంటే ముందస్తు ప్రసవం? పెళ్లయిన ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. గర్భం ధరించాక జాగ్రత్తలు పాటించే వారి సంఖ్య మాత్రం తక్కువే. గర్భధారణ సమయంలో చిన్న చిన్న అంశాలు కూడా ఒక్కోసారి ప్రమాద కారకాలుగా మారుతాయి. అలాంటిదే చిగుళ్ల వాపు. ఎవరికైతే గర్భధారణ సమయంలో ఈ చిగుళ్ల వాపు సమస్య ఉంటుందో వారికి ముందస్తుగా ప్రసవం అయ్యే అవకాశం ఉందని ఒక అధ్యయనం చెబుతుంది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ కి చెందిన శాస్త్రవేత్తలు నోటి ఆరోగ్యానికి, గర్భధారణకు మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టేందుకు అధ్యయనం నిర్వహించారు. దంతాలపై ఉన్న బ్యాక్టీరియా లేదా చిగుళ్లపై ఉన్న బ్యాక్టీరియా నోటిద్వారా పొట్టలోకి.... పొట్ట నుంచి మాయ ద్వారా బిడ్డకు చేరడానికి ఎక్కువ కాలం పట్టదు. దీనివల్ల బిడ్డకు కూడా అనేక సమస్యలు రావచ్చు. ముఖ్యంగా నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ప్రమాదము ఉంది. అందుకే గర్భం ధరించాక ఆహారం, మందుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో నోరు శుభ్రంగా ఉంచుకునే విషయంలో కూడా అంతే జాగ్రత్తలు పాటించాలి.