రంజాన్ మాసం అంటే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది హలీమ్. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మటన్, బీఫ్, చికెన్ తో హలీమ్ తయారు చేస్తారు. చూసేందుకు పేస్ట్ లాగా మెత్తగా ఉంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ చేర్చడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. కేలరీలు అధికంగా ఉండే హలీమ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోల్పోయిన శక్తిని హలీమ్ తింటే తిరిగి పొందవచ్చు. ఇది తక్షణమే శరీరానికి శక్తినిస్తుంది. గ్రేవీగా ఉండే వేడి వేడి హలీమ్ చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. ఇందులోని పీచు పదార్థం కారణంగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి చక్కని ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. హలీమ్ ని ఒక్కపక్కరూ ఒక్కో పేరుతో పిలుస్తారు. అరేబియన్లు, ఆర్మేనియా వాళ్ళు 'హరీస్' అంటారు. Images Credit: Pixabay/ Pexels