ఇక్కడ కిలో జీడిపప్పు 30 రూపాయలే



జీడిపప్పును మీరు ఎంత పెట్టి కొంటున్నారు? కిలో 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెట్టాల్సిందే.



మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు.



జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్లోని జంతార అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామంలో.



ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది.



ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు.



2010లో నాలా గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీ శాఖ గుర్తించింది.



ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. అంతా వచ్చి తక్కువ ధరకే జీడిపప్పును కొని పట్టుకెళ్తున్నారు.



అది కూడా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తోంది.