ఎసిడిటీ నుంచి రిలీఫ్ పొందేందుకు ఎక్కువ మంది పాలు తాగుతారు. గుండెల్లో మంటగా ఉంటే చల్లటి పాలు తాగితే రిలీఫ్ వస్తుందని చెప్తారు.

పాలు చాలా సంవత్సరాలుగా ఎసిడిటీకి సంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

ఇందులోని ఆల్కలీన్ స్వభావం కడుపులోని అదనపు యాసిడ్స్ ని తటస్థం చేయడంలో సహాయపడతాయి.

పాలు ఎసిడిటీకి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి కానీ శాశ్వత పరిష్కారం కాదు.

పాలలో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. ఆమ్లత్వ లక్షణాలని మరింత పెంచేస్తాయి.

ఎసిడిటీ తగ్గించుకోవడం కోసం పాలు తాగితే వచ్చే మరొక సమస్య యాసిడ్ రిఫ్లక్స్. దీని వల్ల ఛాతిలో, గొంతులో మంటగా అనిపిస్తుంది.

ఎసిడిటీగా అనిపిస్తే పాలపై ఆధారపడే బదులు మీరు చేయాల్సిన మొదటి పని సరైన ఆహారం తీసుకోవడం.

ఎసిడిటీ సమస్య నుంచి బయట పడేందుకు కొన్ని ఆహార పదార్థాలు కూడా సహాయపడతాయి.

చామంతి పూల టీ, పండిన అరటి పండు తినడం, అల్లం, కాస్త తులసి ఆకులు నమిలినా గుండెల్లో మంట తగ్గించుకోవచ్చు.

Images Credit: Pixabay/ Pexels