నొప్పులు తగ్గించుకోవడం కోసం చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటికి బదులు మీ కిచెన్ లోని వీటిని తీసుకోండి. ఎంతటి నొప్పి అయినా చిటికిలో తగ్గిపోయేలా చేస్తాయి. అవేంటో తెలుసా.. పంటి నొప్పికి లవంగం గొప్ప ఔషధం. యాంటీ ఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. అల్లం క్రమం తప్పకుండా ఐదు రోజుల పాటు తీసుకుంటే కండరాల నొప్పులు తగ్గుతాయి. ఇది సహజ నివారిణి. ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించే గుణం పసుపులో ఉంది. మిరపకాయలో క్యాప్సైసిన్ అనే సహజ నొప్పి నివారణ గుణం కలిగి ఉంది. పవిత్రమైన తులసి శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో ఔషధాల్లో విరివిగా వాడతారు. ఆర్థరైటిస్, తీవ్రమైన వ్యాయామాల వల్ల వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. యాంటీ బయాటిక్ లక్షణాలు ఉన్నాయి. రుతుతిమ్మిర్లు తగ్గిస్తుంది. ఉబ్బరం, కడుపులో మంట నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.