చికెన్ లేదా పనీర్ - ప్రొటీన్ కోసం ఏది తినాలి? శరీరానికి అత్యవసరమైన పోషకాల్లో ప్రోటీన్ మొదటిది. ప్రోటీన్ లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దాడి చేస్తాయి. ప్రొటీన్ కోసం పనీర్, చికెన్ ఈ రెండూ తినడం వల్ల ఉపయోగమే. అయితే ఆ రెండింట్లో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం ఎక్కువ ప్రోటీన్ కావాలంటే చికెన్ తినాలి. ప్రతి 100 గ్రాములు చికెన్‌లో 31 గ్రాముల ప్రోటీన్ ఉంటే, ప్రతి 100 గ్రాముల పనీర్‌లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల చికెన్ తినడం వల్ల 165 కేలరీలు శరీరంలో చేరితే, 100 గ్రాముల పనీర్ తినడం వల్ల 265 నుంచి 320 కేలరీలు శరీరంలో చేరుతాయి. కాబట్టి శాకాహారులైతే పనీర్, మాంసాహారులైతే చికెన్ తినడమే బెటర్. చికెన్, పనీర్ ఈ రెండింట్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. చికెన్‌లో విటమిన్ బి12, నియాసిన్, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇక పనీర్‌లో కాల్షియం కూడా లభిస్తుంది.