ఉగాదికి మామిడికాయ పులిహోర



మామిడి తురుము - రెండు కప్పులు
వండిన అన్నం - రెండు కప్పులు
పోపు గింజలు - కొద్దిగా
పచ్చిమిర్చి - ఆరు
అల్లం - చిన్న ముక్క



వేరుశనగ పలుకులు - 50 గ్రాములు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఎండుమిర్చి - నాలుగు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర టీ స్పూను



ముందుగా అన్నాన్ని వండి పెట్టుకోవాలి. అన్నం పొడిపొడిగా ఉండే చూసుకోవాలి.



వేరుశెనగ పలుకులు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి పచ్చిమిరపకాయలను, కరివేపాకును వేసి వేయించాలి.



అందులోనే మామిడి తురుము, ఉప్పు కలిపి రెండు మూడు నిమిషాలు పాటూ గరిటెతో బాగా కలపాలి. పసుపు కూడా వేసి కలపాలి.



అన్నీ బాగా కలిశాక ముందుగా వండుకున్న అన్నాన్ని కూడా వేసి కలుపుకోవాలి.



అంతే పుల్లపుల్లని మామిడి పులిహోర రెడీ అయినట్టే. ఉగాదికి ఇది బెస్ట్ నైవేద్యం.