పెసరపప్పు - సొరకాయతో క్రిస్పీ దోశెపెసర పప్పు - ఒక కప్పు
సొరకాయ ముక్కలు - ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక స్పూను
అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర - ఒక కట్ట
నూనె - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడాపెసర పప్పు ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి.మిక్సీలో పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.సొరకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పెసరపప్పు పిండిలో కలపాలి.ఈ మిశ్రమంలో కొత్తిమీర తరుగు, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి.స్టవ్ పై పెనం పెట్టి నూనె వేసి దోశె వేసి కాల్చుకోవాలి.రెండు వైపులా కాల్చుకుని కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు.


Thanks for Reading. UP NEXT

హ్యాపీయెస్ట్ దేశాల జాబితా ఇదే, మన నెంబర్ ఎంతంటే

View next story