కంటి స్ట్రోక్ గురించి మీకు తెలుసా? అందరికీ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించే తెలుసు, కానీ కంటికి కూడా స్ట్రోక్ వస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు. కంటి స్ట్రోక్ వస్తే చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువ. కంటి స్ట్రోక్‌ను కంటి పక్షవాతం గా కూడా చెప్పుకోవచ్చు. కంటి స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకోకూడదు. అస్పష్టంగా కనిపించడం, చూపులో చీకటి ప్రాంతాలు లేదా నీడ లాంటివి కనిపించడం జరుగుతుంది. కంటిలోని రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగా లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆప్టిక్ నాడి అనేది మెదడును, కంటిని అనుసంధానించే ఒక నరం. ఈ ఆప్టిక్ నాడి దెబ్బతింటే కంటి స్ట్రోక్ అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి , గ్లాకోమా వంటి కంటి సమస్యలతో బాధపడే వారు కంటి స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. చూస్తున్నప్పుడు బూడిద రంగు మచ్చలు కనబడుతున్నా, కంటి మధ్యలో రక్తం లేదా ద్రవాలు లీక్ అవుతున్నా కూడా అది స్ట్రోక్ కు వల్ల అవ్వచ్చు.