పావురాల వల్ల వచ్చే ప్రమాదాలు ఇవే

పావురాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

పావురం రెట్టల కారణంగా 60కి పైగా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.

పావురం రెట్టల్లో E.coli అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీని కారణంగా వచ్చే అంటు వ్యాధులు ఎన్నో.

మెట్రో నగరాల్లో పావురాలకు మేత వేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది.

మేత వేయడం మానుకోమని చెబుతున్నారు వైద్యులు.

పావురాల వ్యర్ధాల వల్ల తీవ్రమైన సమస్యలు వస్తున్నప్పటికీ అవగాహన లేక ఎంతో మంది ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

ఆ రెట్టల్లో హిస్టో ప్లాస్మోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ క్యాండీ డియాసిస్, క్రిప్టో కోకోసిస్ వంటి బ్యాక్టిరియాల వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలవు.