రోజుకొక క్యారెట్ తింటే అనేక అనారోగ్య సమస్యలను దూరం పెట్టేయవచ్చని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. క్యారెట్ తినలేకపోతే చక్కగా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వయసు సంబంధిత మచ్చలు, ఇతర కంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. క్యారెట్లు కళ్ళకు చాలా మంచిది. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ కాంతి వల్ల కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్, ఏ, సి రోగనిరోధక వ్యవస్థని పెంచడంలో సహాయపడే కీలకమైన వాటిని క్యారెట్ అందిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్ డ్యామేజ్ ని నివారిస్తుంది. కాలేయానికి మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, కెరొటీనాయిడ్స్ ఉన్నాయి. క్యాన్సర్ కణాల పురోగతిని మందగించేలా చేయడంలో క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్ రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా క్యారెట్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.