కారం వాడకాన్ని తగ్గించకపోతే కష్టమే



భారతీయ వంటల్లో కూర, బిర్యాని వంటివి రెడీ అవ్వాలంటే కచ్చితంగా ఎర్ర కారం పడాల్సిందే.



ఎర్రకారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడమని సలహా ఇస్తున్నారు. ఎర్ర కారాన్ని అధికంగా తినడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు పడతాయని చెబుతున్నారు.



ఎవరైతే కారాన్ని అధికంగా తింటారో వారి పొట్టలో పుండ్లు, అల్సర్లు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు.



మిరపపొడికి కారంగా ఉండే రుచిని ఇచ్చే సమ్మేళనం క్యాప్సైసిన్. ఈ సమ్మేళనం పొట్టలోని పై పొరను చాలా చికాకు పెడుతుంది. మంట పుట్టిస్తుంది.



కొంతమంది వ్యక్తుల్లో అధిక కారంతో తిన్న ఆహారం వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంది.



రోజూ కారాన్ని ఎక్కువగా తినే వారికి పొట్ట క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే దీనివల్ల DNA దెబ్బతినే ఛాన్సులు కూడా ఉన్నాయి.



కాబట్టి కారం వాడడం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.