ఒత్తిడిని తగ్గించే నారింజ పండ్లు



తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే నారింజను తినడం వల్ల వెంటనే మానసిక స్థితి మారుతుందని, ఆందోళన తగ్గుతుందని చెబుతున్న ఆరోగ్య నిపుణులు.



నారింజ తొక్కను చిదిమి వాసన చూడండి, దాన్నుంచి సిట్రస్ ఫ్లేవర్ వస్తుంది. ఆ వాసన పీల్చుతుంటేనే ఏదో తెలియని అనుభూతి.



ఈ సిట్రస్ ఫ్లేవర్ స్వచ్ఛమైన గాలిలో కలిసి తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.



అలాగే సెరోటోనిన్ స్థాయిలను పెంచడం ద్వారా సహజంగా ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.



నారింజపండును రోజూ తినడం వల్ల మెదడు కణాలు పునరుత్పత్తి మెరుగ్గా జరుగుతుంది.



ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.



మీకు తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళన అనిపిస్తున్నప్పుడు నారింజపండును తినడం లేదా నారింజపండు రసాన్ని తాగడం ద్వారా కార్టిసాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.



నారింజ తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారి అందాన్ని పెంచుతుంది.