నిద్రమాత్రలు వాడితే వచ్చే సమస్యలు ఇవే నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటివి మానసికపరమైన కారణాలు. అధిక కాఫీ తీసుకోవడం, ఆకలితో పడుకోవడం, జీర్ణక్రియ సరిగా లేకపోవడం వంటి వాటివల్ల కూడా నిద్ర రాదు. చాలా మంది నిద్రమాత్రలు వాడడానికి ఇష్టపడుతుంటారు. అవి వాడితే చాలా సమస్యలు వస్తాయి. తల తిరగడం, గందరగోళంగా అనిపించడం, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, జుట్టు రాలిపోవడం, మెరుగ్గా ఆలోచించ లేకపోవడం వంటివి కలుగుతాయి. నిద్ర మాత్రలు వాడేవారు ఎక్కువగా పగటిపూట కూడా మగతగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీద రద్దీ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిద్ర మాత్రల వాడకాన్ని తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడం ద్వారా నిద్ర సహజంగా పట్టేలా చూసుకోండి. నిద్ర పట్టాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. నిద్రపోయే ముందు మాత్రం ఆ సమస్యలను మర్చిపోయి హాయిగా నిద్రపోవాలి.