డబ్బుతోనే ఆనందం అంటున్న అధ్యయనం ఆనందం అంటే డబ్బుతో కొనేది కాదని, అది చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడం ద్వారా వస్తుందని వింటూనే ఉంటాం. కానీ ఓ అధ్యయనం మాత్రం అది పచ్చి అబద్ధమని, డబ్బుతో ఆనందాన్ని కొనగలమని చెబుతోంది. 2010లో తొలిసారిగా డబ్బు ఆనందాన్ని పెంచుతుందా లేదా అన్న అంశంపై అధ్యయనం నిర్వహించారు. డేనియల్ కాన్హమాన్, మాథ్యూ కిల్లింగ్‌వర్త్స్ అనే ఇద్దరు ప్రపంచ స్థాయి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. తాజాగా మళ్లీ అలాంటి అధ్యయనాన్నే నిర్వహించారు. 33,000 మంది అమెరికన్లపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఎవరికైతే ఎక్కువ ఆదాయం వస్తుందో, వారు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి ఆదాయం, ఆనందానికి మధ్య గట్టి బంధం ఉందని ఈ పరిశోధన తేల్చింది. ఆర్థికంగా బాగా ఉన్నవారు సంతోషంగా ఉంటున్నట్టు గుర్తించారు. అన్నివేళలా ఈ పరిశోధన నిజం కాకపోవచ్చు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, కుటుంబ బంధాలు బలంగా ఉన్నవారికి ఆదాయం వల్ల ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.