వేసవిలో మండే ఎండల్లో ఇంటికి రాగానే చల్లని పానీయాన్ని తాగాలనిపిస్తుంది.
రోజు నిమ్మకాయ కోయాల్సిన అవసరం లేకుండా నిమ్మ పొడిని తయారు చేసుకుంటే సరి. తాగాలనిపించినప్పుడు గ్లాసు నీటిలో రెండు చెంచాల పొడి కలుపుకుని తాగితే తాజా నిమ్మరసం తాగిన ఫీలింగ్ వస్తుంది.
నిమ్మకాయలను కోసి రసం తీసి పెట్టుకోవాలి. మిక్సీలో పంచదార వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
పెద్ద ట్రే పై ఈ పంచదార పొడిని కాస్త ఉప్పును, నిమ్మ రసాన్ని చల్లుకొని, ఆ మిశ్రమాన్ని చేతులతో బాగా కలపాలి.
ఆ ట్రేపై ఒకే చోట కుప్పలా కాకుండా ఈ పొడిని ఎండబెట్టడానికి వీలుగా ట్రే అంతా విస్తరించేలా చేయాలి.
దీన్ని ఎండలో నాలుగైదు రోజులు ఎండబెట్టాలి. దుమ్ము ధూళి పడకుండా పైన ఏదైనా కవర్ చేయడం మంచిది.
నాలుగైదు రోజుల్లో అది పొడిలా మారిపోతుంది. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి ఉంచుకోవాలి.