ఇన్స్‌స్టెంట్ నూడిల్స్‌తో వచ్చే రోగాలు ఇవే



నూడిల్స్‌ను గోధుమపిండి లేదా మైదాపిండి, నీరు, ఆల్కలీన్ ఖనిజమైన కాన్సుయ్ వంటి వాటితో తయారుచేస్తారు.



కేవలం ఐదు నిమిషాల్లో వీటిని వండేసుకోవచ్చు. అందుకే అత్యంత సౌకర్యవంతమైన బ్రేక్ ఫాస్ట్‌గా ఇది మారిపోయింది.



వీటిని తరచూ తినడం వల్ల ప్రాణాంతక రోగాల బారిన పడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నాయి అధ్యయనాలు.



వీటివల్ల అధిక స్థాయిలో సోడియం శరీరంలో చేరుతుంది. పొట్ట క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.



దీర్ఘకాలిక తలనొప్పి, వికారం, అధిక రక్తపోటు, బలహీనత, కండరాలు బిగుతూ, ఛాతి నొప్పి, గుండె దడ మొదలైనవి వచ్చే ఛాన్సు కూడా ఉన్నాయి.



వైద్యులు చెబుతున్న ప్రకారం వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇన్స్‌స్టెంట్ నూడిల్స్ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది.



ఇన్స్‌స్టెంట్ నూడిల్స్ అధికంగా తినడం వల్ల కాలేయానికి ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు రావచ్చు. కాలేయ పనితీరు మారిపోవచ్చు.



వీటిని మొదట జపాన్లో 1958లో తయారు చేశారు.