రోజుకో అరగ్లాసు బీట్రూట్ జ్యూస్‌తో రెట్టింపు అందం బీట్‌రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మంచిది. బీట్‌రూట్ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కలిగే హానిని అడ్డుకుంటాయి. బీట్‌రూట్ రసాన్ని రోజూ అరగ్లాసు తాగి చూడండి. ఈ చర్మంలోని మెరుపును, జుట్టులో పెరుగుదలను మీరే గమనిస్తారు. ముడతలు, నల్ల మచ్చలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. వృద్ధాప్య సంకేతాలను త్వరగా రాకుండా నిరోధిస్తాయి. ఈ జ్యూస్‌లో ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. బీట్‌రూట్లో బీటా లైన్లు ఉంటాయి. ఇవి చర్మానికి రక్తప్రసరణను పెరిగేలా చేరి కాంతిమంతంగా మారుస్తాయి. బీట్‌రూట్ జ్యూస్ అనేది సహజమైన డిటాక్సిఫైయర్. ఖాళీ పొట్టతో ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగించుకోవచ్చు. ఇలా పోవడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. మొత్తం మీద శరీర ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది.