విటమిన్ బి12 లోపిస్తే వచ్చే సమస్యలు ఇవే



శరీరానికి అవసరమైన, అత్యవసరమైన పోషకాలలో విటమిన్ బి12 ఒకటి. ఇది మన DNA సంశ్లేషణలో సహాయపడే ఒక ముఖ్యమైన పోషకం.



ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా దీని పాత్ర చాలా ప్రధానమైనది.



శరీరంలో విటమిన్ బి12 తగినంత స్థాయిలో లేకపోతే శరీరంపై అనేక రకాలుగా ఆ ప్రభావం కనిపిస్తుంది.



శరీరంలో విటమిన్ బి12 లోపించినప్పుడు శరీరమంతా ఆక్సిజన్ ప్రవహించడం లోపించి అలసట వస్తుంది.



విటమిన్ బి12 లోపిస్తే జీర్ణవ్యవస్థ పై ఆ ప్రభావం పడుతుంది. ఇది అతిసారం, వికారం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, ఆకలి లేకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది.



విటమిన్ బి12 లోపిస్తే నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. నరాల సమస్యలు ఒక్కసారి వస్తే వాటిని తగ్గించడం చాలా కష్టం.



చర్మం పసుపు రంగులోకి మారడం, గొంతు నాలుక ఎర్రబారడం, నోటి పూతలు రావడం, నడిచే విధానంలో మార్పులు రావడం, కళ్ళు సరిగా కనబడకపోవడం, చిరాకు, నిరాశ వంటివి కలుగుతాయి.