మూత్రపిండాల్లో రాళ్లు కరగాలంటే బీర్ తాగాలా?


మూత్రపిండాల్లో రాళ్లు చేరడం అనేది ఎక్కువ మందిని ఇబ్బంది పడుతున్న సమస్య.



ఒక సర్వే ప్రకారం బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చని మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్టు తెలిసింది.


వైద్యులు చెబుతున్న ప్రకారం ఇది ఒక అపోహ. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారిలో 50 శాతం మంది బీరు తాగడం ద్వారా రాళ్ళను కరిగించుకోవాలని అనుకున్నట్టు ఈ సర్వే చెప్పింది.


బీరు వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయన్నది దానిపై ఎలాంటి శాస్త్రీయ నిరూపణ జరగలేదు.



బీర్ తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతుంది. చిన్నచిన్న రాళ్లు ఉంటే ఆ మూత్రం నుంచే బయటికి పోతాయి.



కానీ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లను శరీరం నుండి మూత్రం ద్వారా విసర్జించడం చాలా కష్టం.



మూడు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న రాళ్లు మాత్రమే మూత్రం ద్వారా బయటికి పోతాయి.