లేత కొబ్బరితో టేస్టీ లడ్డూ రెసిపీ



కొబ్బరి తురుము - ఒక కప్పు
పాలపొడి - ఒక కప్పు
పంచదార - ముప్పావు కప్పు
నెయ్యి - పావు కప్పు
యాలకుల పొడి - 1/4 స్పూను
జీడిపప్పు తరుగు - రెండు స్పూన్లు



స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక సన్నగా తరిగిన కొబ్బరి తురుమును వేసి పొడిగా అయ్యేవరకు వేయించాలి.



దానిలో పాలపొడి, యాలకుల పొడి వేసి కూడా కలపాలి.



మరొక కళాయిలో చక్కెర, నీళ్లు వేసి సిరప్‌లా అయ్యే వరకు మరిగించాలి. కొబ్బరి పాలపొడి మిశ్రమంలో ఈ చక్కెర సిరప్‌ను వేసి బాగా కలపాలి.



కళాయికి మిశ్రమం అంటుకోకుండా, తక్కువ వేడి మీద ఉంచి, గరిటెతో కలుపుతూ ఉండాలి.



సన్నగా తురిమిన జీడిపప్పును కూడా వేసి కలపాలి. లడ్డూ చుట్టడానికి వీలుగా ఆ పొడి మందంగా అయ్యేవరకు అలా చిన్న మంట మీద ఉడికిస్తూనే ఉండాలి.



తరువాత స్టవ్ కట్టేసి చేతులకు కాస్త నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని లడ్డూలా చుట్టుకోవాలి.