ఇలా చేస్తే గర్భిణీలకు మధుమేహం వచ్చే అవకాశం



గర్భం ధరించిన సమయంలో కూడా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. దీన్నే జెస్టిషనల్ డయాబెటిస్ అంటారు.



ప్రసవం అయ్యాక చాలామందిలో ఈ మధుమేహం పోతుంది, కానీ కొందరిలో మాత్రం అలా కంటిన్యూ అయిపోతుంది.



అధ్యయనం ప్రకారం రాత్రి నిద్ర పోయే ముందు గర్భిణులు ఎక్కువ కాంతిని చూడడం వల్ల మధుమేహం వచ్చే సమస్య పెరుగుతుందని తేలింది.



అందుకే నిద్రపోయే ముందు గర్భిణులు ఫోన్లు, టీవీలు వంటివి చూడడం మంచిది కాదు. లైట్లు కూడా గదిలో ఆపి వేసుకోవడం మంచిది.



మీరు పడుకోవడానికి ముందు మూడు గంటల్లో మీ చుట్టూ ఉన్న వాతావరణం లో ఉన్న కాంతిని తగ్గించడానికి ప్రయత్నించాలి.



ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ తరంగాలు మీ ఆరోగ్యం పైనా, బిడ్డ ఆరోగ్యం పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.



ఫోన్లు వాడడం తగ్గించుకుంటనే మంచిది. అధిక రేడియేషన్ వల్ల పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ సమస్యలు రావచ్చు.