వంటల్లో ఉప్పు ఎక్కువ పడితే ఇలా చేయండి



కూరలు, సూప్‌లు వంటి వాటిలో ఉప్పు, కారం అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ రెండింటి రుచి సమపాళ్లలో ఉంటేనే ఆ కూరకు రుచి వస్తుంది.



ఉప్పు అధికంగా పడ్డాక దాని తొలగించడం కష్టం అనుకుంటారు చాలామంది. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా అధిక ఉప్పును సరి చేయవచ్చు.



టమోటో ప్యూరీ, నిమ్మరసం, వెనిగర్ వంటివి ఆమ్ల పదార్థాలను కూరల్లో కలపడం వల్ల ఉప్పు రుచి తగ్గుతుంది.



వెజిటబుల్ కర్రీలో అనుకోకుండా ఉప్పు ఎక్కువ పడితే మరిన్ని కూరగాయలను జోడించాలి.



కూర లేదా సూప్ వంటివి వండుతున్నప్పుడు ఉప్పు అధికంగా పడితే గ్లాసు నీటిని వేసి కాసేపు ఉడికించండి. నీటిని వేయడం వల్ల ఉప్పు పల్చబడుతుంది.



ఉప్పు అధికంగా పడితే చక్కెరను జోడించడం కూడా ఒక పద్ధతి. ఎందుకంటే చక్కెర లవణాన్ని అడ్డుకుంటుంది.



తాజా క్రీమ్ లేదా పాలు వంటివి ఇంట్లో ఉన్నప్పుడు అదనపు ఉప్పును అడ్డుకునేందుకు కూరల్లో వీటిని వేసుకోవచ్చు.



క్రీమ్, పాలల్లో కూడా చక్కెర ఉంటుంది. ఇది సమర్థవంతంగా ఉప్పదనాన్ని సమతుల్యం చేస్తుంది. అంతేకాదు రుచిని కూడా పెంచుతుంది.