ఉప్పు ఎక్కువైతే ఈ సమస్యలు తప్పవు



ఆహారంలో ఉప్పు ఉండటం ముఖ్యమే. కానీ అది అధికమైతే మాత్రం చాలా ప్రమాదం.



భోజనం చేసేటప్పుడు చాలా మంది పక్కన ఉప్పు డబ్బా పెట్టుకుంటారు. ఆహారంలో ఉప్పు సరిపోకపోతే చాలు...పైన చల్లుకొని కలుపుకొని తినేస్తూ ఉంటారు.



ఉప్పు శరీరంలో అధికమైనప్పుడు మూత్రపిండాలు అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా రక్త పోటు పెరిగిపోతుంది.



ఉప్పు వల్ల బోలు ఎముకల వ్యాధి అంటే ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది.



అధిక ఉప్పు తీసుకోవడం వల్ల దాహం కూడా పెరుగుతుంది.అదనపు సోడియంను విసర్జించలేక దాన్ని పలుచన చేసేందుకు అదనపు ద్రవాలను ఉపయోగిస్తుంది.



మూత్రం ద్వారా ఆ అదనపు ద్రవాలు బయటకి పోవు. దీనివల్ల శరీరంలోనే ఆ ద్రవాలన్నీ ఉండిపోతాయి. తద్వారా సోడియం తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా కూడా బరువు పెరగవచ్చు.



అధిక రక్తపోటు వస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వంటివి కూడా రావచ్చు.