ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు పుచ్చకాయ తినడం చాలా మంచిదే. వడదెబ్బ బారిన పడకుండా ఈ పండు కాపాడుతుంది.

పుచ్చకాయలో అధిక స్థాయిలో లైకోపీన్ ఉంటుంది. దీనివల్ల పుచ్చకాయ గుజ్జుకు అంత ఎరుపు రంగు వస్తుంది.

ఇది అత్యుత్తమ యాంటీ ఆక్సిడెంట్. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపడం ద్వారా ఎంతో మేలు చేస్తుంది.

ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది.

పుచ్చకాయలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ స్థాయిలు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుని అందిస్తాయి.

పుచ్చకాయలో నీరు, ఫైబర్ ఉంటుంది. ఇది తింటే పొట్ట నిండుగా అనిపిస్తుంది. బరువు తగ్గుతారు.

100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 6.2 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. మధుమేహులు ఎటువంటి భయం లేకుండా తినొచ్చు.

గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.

ఇందులోని లైకోపీన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఇందులోని విటమిన్ సి చిగుళ్ళను కాపాడుతుంది. దంతాలు తెల్లగా మార్చి, పెదవులు పొడిబారకుండా కాపాడుతుంది.

పుచ్చకాయ జ్యూస్ గా చేసుకుని తాగినా చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

Images Credit: Pexels