వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది. మజ్జిగలో కొద్దిగా నిమ్మకాయ రసం, కాస్త కొత్తిమీర వేసుకుని తాగితే వడదెబ్బ నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. కండరాలు బలోపేతం చేయడం, మెరిసే చర్మాన్ని ఇచ్చేందుకు, బలమైన ఎముకల్ని నిర్మించడంలో మజ్జిగ సహాయపడుతుంది. ఒక గ్లాసు మజ్జిగలో ప్రోబయోటిక్స్, విటమిన్ ఏ, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కళ్ళని ఆరోగ్యంగా ఉంచుతాయి. మజ్జిగలో రిబోఫ్లోవిన్ ని అందించే విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. కడుపులో మంటని తగ్గిస్తుంది. మజ్జిగ పాలకు సరైన ప్రత్యామ్నాయం. ఇది జీర్ణం కావడం కూడా చాలా సులభం. మజ్జిగలో పేగుల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది ఆహారాన్ని వేగంగా, సాఫీగా జీర్ణం అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. మజ్జిగ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మజ్జిగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది గ్లాసు మజ్జిగలో నల్ల మిరియాలు, కొత్తిమీర కలిపి తీసుకుంటే ఎసిడిటీ లక్షణాలు తక్షణమే తగ్గించుకోవచ్చు. Images Credit: Unsplash/ Pexels