పానీపూరి తింటే జరిగేది ఇదే మనం పానీ పూరి అని పిలిస్తే, ఉత్తర భారతీయులు గోల్ గప్పే అని పిలుస్తారు. ఇది మన దేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ఉడికించిన బంగాళాదుంపలు, పుదీనా నీటితో ఆ రుచి నాలుకకు తెగ నచ్చేస్తుంది. ఏ కాలంలో అయినా పానీపూరి ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు. పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. గోధుమలు, రవ్వ, చిక్ పీస్, బంగాళాదుంపలు వంటివి జీర్ణవ్యవస్థను కాపాడతాయి. పానీపూరిలో వాడేవి నీళ్లు, ఉడికించిన పదార్థాలే. ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం వల్ల శరీరానికి అందే కేలరీలు కూడా తక్కువే. ఎసిడిటీ సమస్య ఉన్నవారు పానీపూరీలను తినడం వల్ల మంచే జరుగుతుంది. ఇందులో అల్లం, పుదీనా, కొత్తిమీర, నల్ల ఉప్పు, జీలకర్ర, కొన్నిసార్లు నల్ల మిరియాలు వంటివి కూడా వాడతారు. ఇవన్నీ కడుపు నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో వాడే పుదీనా ఆకుల రసం శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంది. నోటి సమస్యలకు, నోటి పొక్కులకు చికిత్స చేస్తుంది. మధుమేహం ఉన్నవారు పానీపూరిని తినవచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగానే ఉంటాయి.