మండే ఎండలకు దాహం ఎక్కువగా ఉంటుంది. గ్లాసుల గ్లాసుల నీళ్ళు పొట్టలోకి పోతూ ఉంటే హాయిగా చల్లగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలన్నా, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలన్నా రోజుకి కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. రోజులో నీరు తాగడానికి ఉత్తమ సమయం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగరంటే ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ, టీ కంటే ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగితే మంచిది. స్నానానికి వెళ్ళేముందు తప్పనిసరిగా ఒక గ్లాసు నీళ్ళు తాగాలి. రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. నిద్రపోయే ముందు అతిగా కాకుండా కొద్దిగా నీళ్ళు తాగడం మంచిది. నిద్రలో దప్పిక అవకుండా నిరోధిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు నీళ్ళు తాగితే కోల్పోయిన ద్రవాలు మళ్ళీ నింపుకోవడం జరుగుతుంది. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. అతిగా తినకుండా నివారిస్తుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు తాగితే రోగం నుంచి త్వరగా రికవర్ అయ్యేందుకు సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల చెమట ద్వారా ద్రవాలు కోల్పోతారు. అందుకే వాటిని భర్తీ చేసుకునేందుకు నీరు తాగడం చాలా ముఖ్యం. Images Credit: Pexels