ఇప్పుడు ఎక్కడ చూసిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ట్రెండ్ నడుస్తోంది. ఈ కాఫీ కీటో డైట్. కాఫీలో నెయ్యి కలపడం వల్ల ఇది బుల్లెట్ ప్రూఫ్ కాఫీగా మారింది. కరోనా మహమ్మారి సమయంలో ఇది బాగా ట్రెండ్ అయ్యింది. ఇదొక కార్బోహైడ్రేట్ అల్పాహారం. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా చేయకుండా బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ తాగితే చాలు పొట్టనిండుగా ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగిన తర్వాత ఏదైనా తిన్నప్పుడు ఇన్సులిన్ నెమ్మదిగా విడుదలవుతుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహం లేదా జీవక్రియ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తీసుకుంటే చాలా ప్రయోజనాలు పొందుతారు. నెయ్యితో చేసిన కాఫీ మహిళలకు అద్భుతంగా పని చేస్తుంది. ఇది హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఇప్పటికే పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడంలో మెరుగ్గా పని చేస్తుంది. నెయ్యి జీర్ణక్రియను నియంత్రిస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రయోజనాలు పొందాలంటే ఎప్పుడు ఖాళీ కడుపుతోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామానికి ముందు దీన్ని తీసుకుంటే మంచిది. ఈ కాఫీని రెండు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.