డయాబెటిస్ ఉంటే పైనాపిల్ తినవచ్చా?



పైనాపిల్ రుచి, వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకే కేకులు, డిసర్ట్ లు, క్రీములు, స్వీట్లు అన్నింట్లో పైనాపిల్ వాడకం పెరిగింది.



ఈ పండు నిండా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి.



ఇప్పుడు ఎంతోమంది సందేహం మధుమేహం ఉన్నవారు పైనాపిల్ తినవచ్చా? లేదా ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అని.



పైనాపిల్ పండులో గ్లూకోజ్, సుక్రోజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనిని అధిక మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.



మధుమేహం ఉన్నవారు అధికంగా పైనాపిల్‌‌ను తినడం మంచిది కాదు. రోజుకి ఒకటి లేదా రెండు ముక్కలతో ఆపేయాలి.



అరకప్పు పైనాపిల్‌లో కార్బోహైడ్రేట్లు 15 గ్రాములు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేందుకు సహకరిస్తాయి.



పైనాపిల్ అధికంగా తింటే పొట్ట కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఖాళీ పొట్టతో పైనాపిల్ తినకూడదు.



చిగుళ్ళు, దంత సమస్యలు ఉన్నవారు కూడా పైనాపిల్ ని తక్కువగా తినాలి.