ఈ వాటర్ బాటిల్స్ కన్నా టాయిలెట్ సీట్లే బెటర్



ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు హెచ్చరించాయి.



మళ్లీ మళ్లీ ఉపయోగించే ఈ నీళ్ల బాటిల్ పై అధిక స్థాయిలో బ్యాక్టీరియా ఉంటుందని చెబుతుంది ఒక అధ్యయనం.



మీ బాత్రూంలోని టాయిలెట్ సీట్ కంటే ఈ బాటిల్ పైనే 40,000 రెట్ల ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనంలో తేలింది.



ఈ వాటర్ బాటిల్స్ పై బాసిల్లస్ కుటుంబానికి చెందిన బ్యాక్టీరియా కాలనీలుగా ఏర్పడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.



ఇంట్లోని పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టే గిన్నెలు కూడా ఈ వాటర్ బాటిల్ కన్నా ఎంతో శుభ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.



ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడం తగ్గించుకోవాలని చెబుతున్నా నిపుణులు. సీట్లు బాటిల్స్ వాడితే మంచిది.



ఎలాంటి కారణాలు లేకుండా తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటే ఒకసారి వాటర్ బాటిల్‌ను మార్చడం కూడా చాలా మంచిది.