దానిమ్మ కూడా యాపిల్ తో సమానంగా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

రోజుకొక మూడు మీడియం సైజు దానిమ్మ పండ్లు తీసుకోవడం వల్ల ధమనుల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పోషకాలతో నిండి ఉంటుంది. తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి.

వృద్ధాప్యానికి దారితీసే ఫ్రీ రాడికల్స్ నుంచి మనలని రక్షిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

రక్తాన్ని పలుచన చేసి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరిచి రక్తప్రసరణకి హాని కలగకుండా చూస్తుంది.

జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే మలబద్ధకం సమస్య దరిచేరదు.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. గుండె పోటు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.

అధిక రక్తపోటుతో బాధపడే వాళ్ళు కనీసం మూడు నెలల పాటు ప్రతిరోజు మూడు దానిమ్మ పండ్లు తింటే మంచిది.

దానిమ్మలోనే కాదు తొక్కల్లో కూడా విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 పోషకాలు ఉన్నాయి.

రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు దానిమ్మ తింటే చాలా మంచిది. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతుంది.
Images Credit: Pixabay/ Pexels

Thanks for Reading. UP NEXT

ఈ వాటర్ బాటిల్స్ కన్నా టాయిలెట్ సీట్లే బెటర్

View next story