రాత్రి భోజనం వల్ల డయాబెటిస్ ముప్పు రాత్రి భోజనానికి మధుమేహం రావడానికి మధ్య సంబంధం ఉందని చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు. ఇప్పుడు ఎంతోమంది బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయాల్సిన సమయాల్లో చేయకుండా... నచ్చినప్పుడు తింటున్నారు. ఎవరైతే రాత్రిపూట సమయానికి ఆహారం తినరో, ఆలస్యంగా తింటారో వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. రాత్రిపూట భోజనం ఏడు గంటలకు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. రాత్రిపూట మేల్కొని, ఆలస్యంగా భోజనం చేసేవారిలో వారి రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి రాత్రి సమయంలో భారీ భోజనాలు మానుకోవాలి. ఏడుగంటలకే భోజనం చేయాలి. ఎవరైతే సాయంత్రం నాలుగు గంటల తర్వాత భారీ భోజనాలు చేస్తారో, వారిలో కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఎక్కువ. బిర్యాని, పిజ్జా, బర్గర్ వంటి అధిక కేలరీలు, అధిక కొవ్వు ఉండే పదార్థాలను ఉదయం పూటనే తినాలి.