ఫ్రెంచ్ ఫ్రైస్, టొమాటో సాస్ కలిపి తింటుంటే ఎంతో రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. రుచికరంగా ఉన్నప్పటికీ ఇందులోని కొవ్వు, కేలరీలు అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయి. కానీ మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేసుకుని తిన్నారంటే మాత్రం బరువు పెరగరు. ఫ్రైస్ ని ఉడకబెట్టి ఆపై ఓవెన్ లో 150 డిగ్రీల వద్ద కనీసం 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. బంగాళాదుంపలకు బదులుగా చిలగడదుంప, క్యారెట్, గుమ్మడికాయ, బీట్ రూట్ కి మసాలాలు జోడించి ఫ్రై చేయొచ్చు. ఎయిర్ ఫ్రైయర్ లో ఆవిరితో ఉడికించుకుంటే కొవ్వు, కేలరీలు తగ్గుతాయి. చాలా తక్కువ నూనెతో వాటిని అందులో వేయించుకోవచ్చు. సన్నని ముక్కలు కాకుండా మందపాటి ముక్కలు చేసుకోవాలి. అందులోని ట్రాన్స్ ఫ్యాట్ నివారించడానికి ఆలివ్ ఆయిల్, సన్ ప్లవర్ ఆయిల్, నువ్వుల నూనె వంటివి ఉపయోగించడం మంచిది. ఎక్కువ ఉప్పు వేస్తే గుండెకి ప్రమాదం. అందుకే రుచి కోసం ఇంట్లో తయారుచేసిన పెరుగు డిప్ తో వాటిని తినొచ్చు. వండటానికి ముందు ఫ్రైస్ లో కొంచెం వెనిగర్ వేసుకోవాలి. ఇది వాటికి క్రంచీనెస్ ఇస్తుంది. వెనిగర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.