అతి తక్కువ ధరకే అద్దెకు ఓ ఊరు వారం రోజులు స్నేహితుల గుంపుతో అలా విదేశాలకు వెళ్లి సేద తీరాలనుకుంటున్నారా? అలా అయితే ఈ గ్రామాన్ని అద్దెకి తీసుకోండి. ఈ గ్రామం మొత్తం ఆ వారం రోజులు మీదే. ఏం చేసినా అడిగే వారు ఉండరు. స్నేహితులతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ గ్రామం ఇటలీలోని ‘లే మార్షే’ ప్రాంతంలో ఉంది. పేరు పెట్రిటోలి. పెట్రిటోలి గ్రామం ప్రజలు నివసించడానికి అనువుగా ఉంటుంది. దాదాపు 200 మంది అతిధులు నివాసం ఉండేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఈ గ్రామాన్ని అద్దెకి తీసుకోవాలంటే ఒక రాత్రికి 1577 డాలర్లు చెల్లించాలి. అంటే ఒక రాత్రికి తొమ్మిదిన్నర లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 50 మంది అతిధులు కలిసి వెళితే అందులో ఒక్కొక్కరు ఒకరోజు ఉన్నందుకు 19000 రూపాయలు చెల్లించాలి. అదే రెండు వందల మంది వెళితే ఒక్కొక్కరు రోజుకి 4700 రూపాయలు చెల్లించాలి. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఇది ఉత్తమ ప్రదేశంగా భావిస్తారు. గ్రామంలోకి వచ్చాక వాహనాలు, ఊరి చివరలోనే నిలిచిపోవాలి. గ్రామం మధ్యభాగంలో తిరగడానికి వీల్లేదు.