సత్తు పిండి మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే కాల్చిన శనగలు తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్నే సత్తు అని అంటారు.

ఖాళీ కడుపుతో సత్తు తీసుకోవడం వల్ల అదనపు కొవ్వుని కరగించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు సత్తు షర్బత్ తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్, పిండిపదార్థాలు, ఖనిజాలు ఉన్నాయి. శక్తిని ఇస్తుంది.

కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. కడుపులో మంట చికాకుని తగ్గిస్తుంది.

సత్తులోని ఐరన్ చర్మానికి మేలు చేస్తుంది. హైడ్రేట్ గా ఉంచుతుంది. జుట్టుకి అవసరమైన పోషణ అందిస్తుంది.

కండరాలను బలోపేతం చేస్తుంది. సరైన విధంగా తింటే బరువు పెరిగేందుకు సహాయం చేస్తుంది.

రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఒక గ్లాసు నీటిలో నీరు, చిటికెడు ఉప్పు సత్తు కలుపుకుని తాగాలి. బీపీని తగ్గించి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

సత్తు మిల్క్ షేక్ తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మొక్కల ఆధారిత ప్రోటీన్లని అందిస్తుంది.

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. చల్లని సత్తు షర్బత్ తాగితే బ్లడ్ ప్రెజర్ , బ్లడ్ షుగర్ అదుపులో ఉంటాయి.

సత్తులో ఇనుము ఉంటుంది. ఎర్ర రక్తకణాల సంఖ్యని పెంచుతుంది. ఆక్సిజన్ సరఫరా పెంచి రోజంతా శక్తినిస్తుంది.

పేగుల నుంచి విష వ్యర్థాలని తొలగించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Image Credit: Unsplash Pexels/ Pixabay