ఒకప్పుడు సారా చాలా బొద్దుగా ఉండేది. కానీ బరువు తగ్గించుకోవడం కోసం తను కఠినమైన నియమాలు పాటించి నాజూకుగా మారింది. సారా 96 కిలోల బరువు ఉండేది. సినిమాలో అవకాశం కోసం దాదాపు 45 కిలోలు తగ్గింది. ప్రస్తుతం 54-56 కిలోల వెయిట్ దగ్గర మెయింటైన్ చేస్తుంది. పాప్ కార్న్, పిజ్జా వంటివి ఎంతో ఇష్టంగా తినే సారా సన్నగా తన రూపం మార్చుకునేందుకు ఎంతో కష్టపడింది. కరణ్ జోహార్ సినిమాలో నటించాలంటే బరువు తగ్గించుకోవాలని చెప్పడంతో సారా తన వెయిట్ తగ్గించుకోవడం మొదలుపెట్టింది. సారా బరువు పెరగడానికి పిజ్జా, బర్గర్, ట్రిపుల్ చాక్లెట్ చిప్ బ్రౌనీలు కారణం. బరువు తగ్గడం కోసం వాటిని దూరం పెట్టేసింది. గుడ్డులోని తెల్ల సొన, ఇడ్లీ, దోస వంటి దక్షిణ భారతీయ వంటకాలు బ్రేక్ ఫాస్ట్ గా ఎంచుకుంది. పప్పు, సబ్జీ, రోటీ, సలాడ్ తో కూడిన ఇంటి భోజనం మధ్యాహ్నం తీసుకునేది. వ్యాయామానికి ముందు ముయేస్లీ, పండ్లతో కూడిన ఓట్స్, టోఫు, సలాడ్, లెగ్యూమ్ తో చేసిన ప్రోటీన్ షేక్ తాగేది. సారా బరువు తగ్గడంలో ఆహారమే కాదు కఠినమైన వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తను ఎక్కువ సేపు జిమ్ లోనే సమయం గడిపేది. మనసు పెట్టి ఏదైనా చేస్తే అందులో తప్పకుండా విజయం సాధిస్తారని సారా నమ్ముతుంది. అది తన విషయంలో రుజువైందని అంటోంది. జిమ్ లో సారా ఎలా కష్టపడుతుందో మీరు చూసేయండి.. Images Credit: Sara Alikhan/ Instagram