వంటల్లో కరివేపాకు తప్పనిసరిగా వేసుకుంటారు. అది వేయకపోతే రుచి ఉండదు. వంటలకు మాత్రమే కాదు అందానికి, జుట్టు సంరక్షణకి కూడా కరివేపాకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కరివేపాకుని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవడం చాలా మందికి తెలియదు. కవర్ పెట్టి మూతి కట్టేయడం వల్ల త్వరగా పాడైపోతుంది. కరివేపాకుని 8-10 రోజుల పాటు ఫ్రిజ్ లో పాడవకుండా ఎలా నిల్వ చేసుకోవాలో సీనియర్ నటి ముచర్ల అరుణ చెప్పుకొచ్చారు. కరివేపాకుని కొద్దిగా తడుపుకుని ఏదైనా ఒక వస్త్రం లేదంటే టిష్యూ పేపర్ మీద పది నిమిషాల పాటు ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల నీటిని అవి పీల్చుకుని కరివేపాకుని శుభ్రంగా పొడి పొడిగా ఉంచేస్తాయి. ఆ తర్వాత రెబ్బలు కోసి ఒక స్టీల్ బాక్స్ లో పెట్టుకోవాలి. ఇలా చేశారంటే కనీసం వారం రోజుల పాటు కరివేపాకు ఫ్రెష్ గా ఉంటుంది. ముచ్చర్ల అరుణ దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇవే కాదు వంట, లైఫ్ స్టైల్, కిచెన్ క్లీనింగ్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నాయి. మీరు చూసేయండి. Images Credit: Aruna Gupta Instagram/ Pixabay