సూర్యోదయానికి ముందు చేసే భోజనాన్ని సహర్ లేదా సెహ్రీ అని కూడా పిలుస్తారు.

రోజంతా ఉపవాసం ఉండటం వల్ల శక్తి తగ్గుతుంది. అందుకే సెహ్రీ టైమ్ లో వీటిని తింటే ఎనర్జీ గా ఉంటారు.

ఇఫ్తార్, సెహ్రీలో తప్పకుండా ఖర్జూరం ఉంటుంది. ఇది తినడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

అధిక ఫైబర్, విటమిన్ సి తో పాటు ఎన్నో పోషకాలు అందిస్తుంది. శక్తివంతంగా ఉంచడమే కాకుండా హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది.

నిర్జలీకరణాన్ని అధిగమించడానికి అరటి పండు మంచి ఎంపిక.

ఉపవాసం టైమ్ లో మంచి నీళ్ళు, లాలాజలం కూడా మింగరు. అందుకే పుచ్చకాయ మీకు నీటి లోటుని భర్తీ చేస్తుంది.

రైతా తప్పకుండా తీసుకోవాలి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ప్రోటీన్లు పొందటం కోసం శనగలతో చేసిన చాట్ తీసుకోవచ్చు. ఇది పొట్టని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.

కూరగాయల కూరతో అన్నం లేదా రోటీ తింటే మంచిది. వీటిలో పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. శక్తినిస్తుంది.

గ్లూటెన్ రహితమైన గోధుమ రవ్వతో కిచిడీ చేసుకుని తినొచ్చు. మధుమేహులకు కూడా మంచిది.

డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
Images Credit: Pixabay/ Pexels