చికెన్ మష్రూమ్... రుచి అదిరిపోతుంది తింటే చికెన్ కర్రీలా అనిపించే పుట్టగొడుగులు ఇవి. వీటి పేరు ‘లేటిఫోరస్ సల్య్వూరియస్’. ముద్దుగా వీటిని ‘చికెన్ ఆఫ్ ది వుడ్స్’ అని పిలుస్తారు. ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో ఓక్ చెట్లపై ఇవి ఎక్కువగా పుడతాయి. అలాగే చెర్రీ, చెస్ట్‌నట్ చెట్లపై కూడా ఇవి కనిపిస్తాయి. ఇవి పూర్తిగా శాకాహారమైనవే. ఎందుకంటే కేవలం చెట్ల కొమ్మలపై మాత్రమే ఇవి పెరుగుతాయి. వీటి రుచి మాత్రం కోడి మాంసంలా ఉంటుంది. దీనిని ‘చికెన్ మష్రూమ్’ అని కూడా పిలుస్తారు. దీనిలో ఫైబర్, క్యాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఈ పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యకరం. ఈ పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ లక్సణాలు అధికం. హార్మోన్ల అసమతుల్యతను ఇది నయం చేస్తుంది. దంతాలు,చిగుళ్ల సంరక్షణకు ఇందులోని గుణాలు సాయం చేస్తాయి.