వేసవిలో లభించే అద్భుతమైన ప్రయోజనాలు అందించేవి తాటి ముంజలు. దీన్నే ఐస్ యాపిల్ అంటారు.

Image Source: Image Credit: Raji Home style

ఐస్ యాపిల్స్ లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇందులో విటమిన్ ఏ, సి, బి7 పుష్కలంగా ఉన్నాయి. కేలరీలు పెంచకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

రక్తంలో చక్కెర పెరుగుదలని నివారిస్తుంది. మధుమేహులకి వేసవిలో మంచి పోషకాలనిచ్చే పండు.

డైటరీ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో పాటు ఫైటోన్యూట్రియెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడతాయి.

వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ముఖం మెరిసేలా చేస్తుంది. దద్దుర్లు వంటి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. దురద, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జుట్టు చిట్లి పోవడం, తెల్ల జుట్టు, బట్టతల రాకుండా చేయడంలో తాటి ముంజలు గొప్పగా పని చేస్తాయి.
Images Credit: Pixabay/ Pexels