కాళ్లలో ఇలా నొప్పి వస్తే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే
శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ అవసరం. అయితే అది అవసరానికి మించి ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే అది చిన్న చిన్న లక్షణాలను చూపిస్తుంది. అందులో ఒకటి కాలు నొప్పి.
కాలు నొప్పి వచ్చాక విశ్రాంతి తీసుకున్న కొంతసేపటికి తగ్గిపోతే అది అధిక కొలెస్ట్రాల్ వల్లనేమోనని అనుమానించాలి. దీన్నే ‘పెరిఫెరల్ ఆర్డరీ డిసీజ్’ అని అంటారు.
కొలెస్ట్రాల్ ధమనుల్లో ఫలకాలు ఏర్పడడానికి దారితీస్తుంది. దీనివల్ల ధమనుల్లో రక్తప్రసరణను ఇది అడ్డుకోవడం లేదా ఇరుకుగా మార్చడం చేస్తాయి.
అలాంటప్పుడు శరీరంలోని వివిధ భాగాలతో పాటు ముఖ్యంగా కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అప్పుడు ఈ వ్యాధి వస్తుంది.
కాళ్లలో తిమ్మిరి పట్టడం, అసౌకర్యానికి గురి కావడం వంటివి కూడా కొన్ని లక్షణాలు.
రాత్రి సమయంలో పడుకున్నప్పుడు మీ పాదాలు, కాళ్లలో మంట లేదా నొప్పి రావచ్చు. పాదాల చర్మం చల్లగా కూడా అనిపించవచ్చు.
ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా అధిక కొలెస్ట్రాల్ ఉందని అర్థం చేసుకోవాలి.