రెడ్ ఫుడ్ కలర్ శాఖాహారం అనుకుంటున్నారా? రెడ్ వెల్వెట్ కేకు, చికెన్ మెజెస్టిక్, పన్నీర్ మెజిస్టిక్, బిర్యానీలు.... ఇలా చాలా వంటకాల్లో రెడ్ ఫుడ్ కలర్‌ను వినియోగిస్తారు. ఆ రెడ్ ఫుడ్ కలర్ దేనితో తయారు చేస్తారు అని? దాన్ని ఏ పదార్థంతో తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు. రెడ్ ఫుడ్ కలర్‌ను కార్మైన్ అని కూడా పిలుస్తారు. ఎన్నో రెస్టారెంట్లలో కృత్రిమమైన ఎరుపు రంగునే వాడతారు. లాటిన్ అమెరికాలో కొచినియల్ అని పిలిచే ఎరుపు రంగు పురుగులు ఉంటాయి. ఆ పురుగు నుంచే ఎరుపు సారాన్ని తీస్తారు. ఒక పౌండ్ కృత్రిమ ఎరుపు రంగును తయారు చేయడానికి 70 వేల పురుగులు అవసరం పడతాయి. కాబట్టి ఆ రెడ్ ఫుడ్ కలర్ శాఖాహారమా? మాంసాహారమా అనేది తినే వారే ఆలోచించుకోవాలి. 2009లో కొచినియల్ పురుగుల నుంచి తయారు చేసే ఈ ఆహార రంగును సహజరంగుగానే పరిగణించడం మొదలుపెట్టారు. ఈ పురుగు నుంచి తయారు చేసే సారం తరచుగా వాడటం వల్ల ఆహార అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.