వండే ముందు పప్పును నీళ్లలో నానబెట్టాలా?



శాకాహారులు, మాంసాహారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినే ఆహారం పప్పు.



మాంసాహారులకు చికెన్ నుంచి ప్రోటీన్ అధికంగా అందుతుంది. శాకాహారులకు మాత్రం పప్పే ప్రధాన ఆధారం.



పప్పును ముందుగా నానబెట్టడం వల్ల వండిన తర్వాత ఆ వంటకానికి మృదుత్వం, అధిక రుచి వస్తుంది. అంతేకాదు వంట సమయం కూడా తగ్గుతుంది.



ఆయుర్వేదం ప్రకారం పప్పును ముందుగా నీళ్లలో నానబెట్టడం వల్ల అందులో ఉండే ఫైటిక్ ఆసిడ్లు, టానిన్ల శాతం తగ్గుతుంది.



ఈ ఫైటిక్ ఆసిడ్లు, టానిన్లు ఉంటే పప్పు తిన్నాక మన శరీరం పోషకాలను గ్రహించడాన్ని అడ్డుకుంటాయి. అలాగే కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి.



కాబట్టి నీళ్లలో నానబెట్టి పప్పు వండడం వల్ల అలాంటి సమస్యలు రావు.



పప్పులు ముందుగా నీళ్లలో నానబెట్టడం వల్ల వాటిలోని ఆమ్ల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.



నానబెట్టడం వల్ల సంక్లిష్ట పిండిని పదార్థాలను విచ్ఛిన్నం అయ్యేలా చేస్తాయి. దీనివల్ల శరీరం ఆ పప్పును సులభంగా జీర్ణం చేసుకుంటుంది.