పాలు తాగిన వెంటనే బయటకు వెళ్లకూడదా?



ప్రతిరోజూ పాలు తాగే వాళ్ళు ఎంతోమంది. కానీ నమ్మకాల ప్రకారం పాలు తాగిన వెంటనే బయటికి వెళ్ళకూడదు అంటారు.



ప్రాచీన నమ్మకాల ప్రకారం పాలు తాగిన వెంటనే బయటకు వెళ్లడం వల్ల ప్రతికూల శక్తులు మనల్ని ఆకర్షిస్తాయని అంటారు.



కేవలం పాలే కాదు, ఏ ఆహారం అయినా తెలుపు రంగులో ఉన్నది తినడం లేదా తాగడం చేశాక బయటకు వెళ్ళకూడదు అని చెబుతారు.



ఇవి ప్రతికూలతను ప్రేరేపిస్తాయని, దురదృష్టాన్ని తెస్తాయని అంటారు. ఇది ఎంతవరకు నిజమో ఎవరూ తేల్చలేకపోయారు.



సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా పాలు తాగిన వెంటనే బయటికి వెళ్లకపోవడమే మంచిది.



కొందరిలో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే సమస్య ఉంటుంది. ఇది ఉన్నట్టు వారికి కూడా తెలియదు.



ఈ సమస్య ఉన్న వారిలో పాలల్లో ఉన్న లాక్టోజ్ ను అరిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది.



అలాంటప్పుడు తాగిన వెంటనే వాంతులు అవ్వడం లేదా విరోచనాలు కావడం వంటివి జరుగుతాయి.



కాబట్టి పాలు తాగాక కాసేపు ఇంట్లోనే ఉండడం వల్ల ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకుని బయటకు వెళ్లొచ్చు.